ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) చికాగో ఆధ్వర్యంలో వార్షిక బతుకమ్మ & దసరా వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 27న అరోరాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం (బాలాజీ టెంపుల్)లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ బతుకమ్మను బహుమతిగా ఇస్తారు. ఈ వేడుకలను ఆటా (ATA) కార్యనిర్వాహక కమిటీ పర్యవేక్షిస్తోంది. ఇందులో జయంత చల్లా (ప్రెసిడెంట్), సతీష్ రామసహాయం రెడ్డి (ప్రెసిడెంట్-ఎలక్ట్), మధు బొమ్మిని (మాజీ ప్రెసిడెంట్), సాయి నాథ్ బోయపల్లి (సెక్రటరీ), శ్రీకాంత్ గుడిపాటి (ట్రెజరర్), శారద సింగిరెడ్డి (జాయింట్ సెక్రటరీ), విజయ్ తూపల్లి (జాయింట్ ట్రెజరర్), నరసింహారెడ్డి గద్దికొప్పుల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), అరవింద్ రెడ్డి ముప్పిడి (ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్) ఉన్నారు. అలాగే, 19వ ఆటా (ATA) మహాసభలు వచ్చే ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరుగుతాయని కూడా ఆటా చికాగో పేర్కొన్నారు.