జూన్ 1కి లక్ష మరణాలు
అమెరికాలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. దీంతో జూన్ 1వ తేదీ నాటికి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని సెంటర్ ఫర్ డిసీజీ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సిడిసి) డైరెక్టర్ డాక్టర్ రెడ్‌ఫీల్డ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక మరణాలు అమెరికాలో చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. కొలంబియా యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి 12 అగశ్రేణి సంస్థలు సమర్పించిన వివరాలను బట్టి సిడిసి ఈ గణాంకాలను విడుదల జేసింది. అమెరికా ప్రజలు పాటిస్తున్న భౌతిక దూరం, ఇతర మార్గదర్శకాలను అనుసరించి ఆయా సంస్థలు ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. అమెరికాలో ఇప్పటికే దాదాపు 14 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా, 84,700 మందికి పైగా మరణించారు.






