టీఎఫ్ఏఎస్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ.. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

తెలుగు కళా సమితి (టీఎఫ్ఏఎస్) ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబరు 21 నుంచి 29వ తేదీ వరకు కేవలం వీకెండ్స్‌లోనే ఈ పోటీలు నిర్వహించనున్నారు. సెంట్రల్ న్యూజెర్సీలో జరిగే ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు సెప్టెంబరు 13వ తేదీలోగా http://www.tfasnj.org వెబ్‌సైటులో తమ జట్టును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతి టీం 200 డాలర్లు చెల్లించాలి.