కర్నూలులో తానా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ రేపు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో రేపు ఆదివారం మే 17 నాడు కర్నూలు సిటీ, పాణ్యం నియోజకవర్గాల్లో నాలుగువేల మందికి పైగా ప్రజలకు పెద్ద ఎత్తున నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. దాదాపు 15 టన్నుల బియ్యం, పప్పులను పంపిణీ చేయనున్నారు.
తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా కార్యదర్శి రవి పొట్లూరి సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలను కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభిస్తారు. కర్నూలు జిల్లాలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే ఇరవైవేలకి పైగా భోజనాలు అందించామని ఇంత భారీ ఎత్తున నిత్యావసర సరుకుల పంపిణీకి సహకారం అందించిన నిరంజన్ శృంగవరపు, రవి పొట్లూరి ని అభినందిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి తెలిపారు.





