TAMA: టామా దసరా-బతుకమ్మ, మహిళా సంబరాలకు ముహూర్తం ఫిక్స్

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ వేడుకలు, మహిళా సంబరాలు జరగనున్నాయి. సెప్టెంబరు 21న జార్జియాలోని జేడ్ బాంకెట్స్‌లో మధ్యాహ్రం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల్లో భాగంగా సంప్రదాయ బతుకమ్మ పోటీలు (Bathukamma) నిర్వహించి, టాప్-3లో నిలిచిన వారికి బహుమతులు అందించనున్నారు. అలాగే 12 ఏళ్ల వరకు వయసున్న చిన్నారులతో సంప్రదాయ, మైథలాజికల్ దుస్తులతో దసరా వేషాల (Dasara Veshalu) పోటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పోటీల్లో గెలిచిన తొలి ముగ్గురికీ మంచి బహుమతులు అందించనున్నారు. బతుకమ్మతోపాటు దరఖాస్తు చేసుకున్న వారికి కోలాటం, కల్చరల్ కార్యక్రమాలు, ఫ్యాషన్ షో కూడా జరగనుందని టామా తెలిపింది. అలాగే మిసెస్ టామా మహారాణి సీజన్-5 పోటీలు (Mrs TAMA Maharani), మాస్టర్ చెఫ్ సీజన్-5 (Master Chef) పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో విజేతలకు మంచి బహుమతులు దక్కుతాయని టామా (TAMA) వెల్లడించింది. ఈ కార్యక్రమానికి రావాలని అనుకునే వారు www.tama.org/mahilasambaralu లింకులో రిజిస్టర్ చేసుకోవాలని టామా తెలిపింది. తనిష్క్ యూఎస్ఏ, స్వాతి సంగెపు, ట్రూవూ, జేడ్ బాంకెట్స్ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు.