NATS: అక్టోబర్ 11న నాట్స్ పిట్స్‌బర్గ్ చాప్టర్ తొలి వార్షికోత్సవం

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) పిట్స్‌బర్గ్ చాప్టర్ తమ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 11 ప్రత్యేక వేడుకలను నిర్వహించనుంది. “నాట్స్ పిట్స్‌బర్గ్ తొలి ఏడాది వేడుకలు మూడు నదులలో ప్రతిధ్వనించాలి” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాట్స్ (NATS) తెలిపింది. పెన్సిల్వేనియాలోని షార్‌బెరీ లేన్‌లో సాయంత్రం 6:00 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయని నాట్స్ తెలిపింది. ఈ వేడుకలకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి కూడా హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాట్స్ (NATS) పిట్స్‌బర్గ్ చాప్టర్ సభ్యులు, రవి కొండపి, శిల్ప బోయిన, రమణాంజనేయులు గొల్లా, శ్రీహర్ష కాలగార, మనోజ్ తాతా, గిరీష్, నెహంత్ దిరిసల, రానా పర్చేరి, ప్రియ బావినేని, శ్రీనివాస్ మెంటా, రవి తుమ్మల, హేమంత్ కేఎస్, అర్చన కొండపి, సాయి అక్కినేని, వెంకట్ దిరిసాల, లీలా అరిమిల్లి తదితరులు కృషి చేస్తున్నారు.