రండి.. రచయితలవుదాం..! అంతర్జాలంలో రచనా శిక్షణ

(Every Saturday & Sunday – 11:00 AM EST to 1:00 PM EST)
చెప్పాలని ఉంది.. గుండె విప్పాలని ఉంది.. అని చాలా మందికి ఉంటుంది. తమ మనస్సులో భావాలను అందమైన కవితలా.. కావ్యంలా చెప్పాలని ఉంటుంది. కానీ ఎలా..వ్రాయాలి..? అనేదే తెలియదు. మీరు తెలుగు చక్కగా వ్రాయటం, మాట్లాడటం వస్తే చాలు.. అదే మీ అర్హత.. మీరు రచయిత అయ్యేందుకు కావాల్సిన శిక్షణ అందించేందుకు ఉత్తరఅమెరికా తెలుగు సంఘం నాట్స్ సంకల్పించింది. ఈ సంకల్ప సాధనలో భాగంగా సరళ పద్య రచన, పద్యం చదివే విధానం ఫై ప్రధానంగా ప్రతి శని, ఆదివారాలలో అక్టోబర్ 23 నుండి డిసెంబర్ 11 వరకు ఉదయం 11 గం. నుండి మధ్యాహ్నం 1 గం. మధ్య అంతర్జాలంలో తరగతులు నిర్వహించటానికి ప్రముఖ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డా. మీగడ రామలింగ స్వామి గారు మనకు సహకారం అందిస్తారు.
మరెందుకు ఆలస్యం.
వెంటనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అంతర్జాలంలో సరళ పద్య రచన మరియు శిక్షణ కోసం మీ పేరు నమోదు చేసుకోండి.