Gukesh: ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజుకు నాట్స్ అభినందనలు
అతి చిన్న వయసులోనే చదరంగంలో చెస్ వరల్డ్ చాంపియన్ కిరీటం కైవసం చేసుకున్న గుకేశ్(Gukesh) దొమ్మరాజుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) హృదయపూర్వక అభినందనలు తెలిపింది. చదరంగంలో చరిత్రలోనే అతి చిన్న వయసులో ప్రపంచ చాంపియన్ గెలుచుకోవడం యావత్ భారత జాతి అంతా గర్వించదగ్గ విషయమని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు.
తెలుగు వాడైన గుకేశ్ ఈ ఘనత సాధించడం తెలుగువారికి కూడా ఎంతో స్ఫూర్తి దాయకమైనదని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. గుకేశ్ అకుంఠిత కార్యదీక్ష, పట్టుదలతో సాధించిన ఈ విజయం చదరంగం ఆడే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా మారుతుందని నాట్స్ తెలిపింది. గుకేశ్ కోసం వారి తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, ఇచ్చిన ప్రోత్సాహం అభినందనీయమని నాట్స్ పేర్కొంది.







