MATA: వైజాగ్ లో ‘మాటా’ సేవా కార్యక్రమం
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మాటా సేవాడేస్ (MATA Seva Days) కార్యక్రమంలో భాగంగా విశాఖపట్టణంలోని ఎంవిపి కాలనీలో ఉన్న లెబెన్షిల్ప్ ప్రత్యేక పాఠశాలలో నవంబర్ 26వ తేదీన మానసిక వికలాంగులకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానంతోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలను మాటా నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ మాటా నాయకులు మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సినీనటి రోజారమణిగారు వచ్చారు. అమెరికాలో కమ్యూనిటీ ప్రముఖులుగా పేరు పొందిన దాము గెదెలతోపాటు మాటా నాయకులు పలువురు ఇందులో పాల్గొన్నారు. మాటా వ్యవస్థాపకులు, అడ్వయిజరీ కమిటీ మెంబర్ శ్రీనివాస్ గనగోని ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరించారు. దాదాపు 600మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమోంటోలను అందించి అభినందించారు.






