అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళనలతో అమెరికా అట్టుడుకిపోతోంది. ఈ అల్లర నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అమెరికన్ అధికారులు దర్యాప్తును చేపట్టారు. మినియాపొలిస్ నగరంలో మే 25న పోలీస్ కస్టడీలో ఫ్లాయిడ్ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే. గాంధీ విగ్రహం ధ్వంసమైన ఘటన పట్ల అమెరికా క్షమాపణలు చెప్పింది. తమ క్షమాపణలను అంగీకరించాలంటూ అమెరికా అంబాసిడర్ కెన్ జస్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని, గాంధీ విగ్రహ ధ్వంసాన్ని కూడా ఖండిస్తున్నట్లు కెన్ జస్టర్ పేర్కొన్నారు. ఎటువంటి వివక్షనైనా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.