తొలి విడతగా 50 వెంటిటేటర్లు : అమెరికా
కరోనా పోరుపై భారత్కు అమెరికా సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. పరస్పర సహకారం అందించే దిశగా భారత్కు 200 వెంటిలేటర్లను పంపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. తొలి విడతగా 50 వెంటిలేటర్లు త్వరలో భారత్కు చేరుకుంటాయని అమెరికన్ అధికారి ఒకరు వెల్లడించారు. కంటికి కనిపించని కరోనా శత్రువుతో పోరాటంలో భారత్కు సహకరించేందుకు అమెరికా వెంటిలేటర్లను పంపిస్తుందని గత వారం ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్కు పంపే వెంటిలేటర్లు విరాళంగా పంపుతామని దీనిపై ఎలాంటి మొత్తం వసూలు చేయబోమని యూఎస్ఎయిడ్ తాత్కాలిక డైరెక్టర్ రమొన హంజోయ్ సృష్టం చేశారు.
అమెరికా, అమెరికన్ల తరపున భారత్ సహా పలు దేశాలకు యూఎస్ ఎయిడ్ వెంటిలేటర్లు, మందులను ఉదారంగా సరఫరా చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ వెంటిలేటర్ల రవాణా, డెలివరీలకు సంబంధించి తాము భారత్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రెడ్ క్రాస్ సొసైటీలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. తక్షణం అవసరమైన వారికి వైద్య సేవలు అందించే క్రమంలో భారత్కు తోడ్పాటును అందించేందుకు వెంటిటేలర్లను విరాళంగా పంపుతున్నామని అన్నారు.






