BEA2025: టిటి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన

న్యూజెర్సిలో జరగనున్న తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (Telugu Times Business Excellence Awards) 2025 వేడుకలు విజయవంతం కావాలని ఆశిస్తూ, ఈ సందర్భంగా తెలుగు టైమ్స్ అమెరికా ఎన్నారైలకు మీడియా పరంగా చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభినందన సందేశం పంపించారు. బిజినెస్ రంగంలో పేరు గడించిన తెలుగు ఎన్నారైలకు అవార్డులు ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించేలా తెలుగు టైమ్స్ చేస్తున్న కృషిని కూడా రేవంత్ రెడ్డి అభినందించారు.