బే ఏరియా, మౌంటైన్ హౌస్ లో ‘కాంతితో క్రాంతి’

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎన్నారై టీడీపీ, జనసేనలు ఇచ్చిన పిలుపు మేరకు బే ఏరియా, మౌంటైన్ హౌస్ ఎన్నారైలు ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు పాల్గొని జగన్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు.