ఆటా ఆధ్వర్యంలో 60 మంది పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో దాదాపు 60 మందికి పైగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, 400 రూపాయిల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగం పెద్దరామిరెడ్డి కాలనీలో మిమిక్రీ రమేష్ ఇంటివద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. 19 వార్డు కౌన్సిలర్ నారని కవిత శేఖర్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పేదలకు వస్తువులను అందజేశారు. మిమిక్రీ రమేష్ సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఆటా అధ్యక్షుడు పరమేష్ భీమిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అనిల్ బొద్దిరెడ్డి, రామకృష్ణా రెడ్డి ఆల ఇతర ఆటా కమిటీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని గౌని వినోద్ గౌడ్ తెలిపారు.






