Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Community » Usa Nri News » Anjaiah chowdary lavu charge as new president of tana

“తానా” కొత్త అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన అంజయ్య చౌదరి లావు (2021 – 23)

  • Published By: cvramsushanth
  • July 14, 2021 / 08:10 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Anjaiah Chowdary Lavu Charge As New President Of Tana

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల లోని మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షాతిరేకం.

Telugu Times Custom Ads

నీతి, నిజాయితీ, నిరాడంబరత, మంచితనం, మాటకు బద్దలై వుండటం, మానవతా దృక్పథం, ప్రజా సేవా తత్పరత మొదలైన సాత్విక లక్షణాలన్నింటి సమాహారమే అంజయ్య చౌదరి లావు. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద తెలుగు సంస్థ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) నూతన అధ్యక్షుడిగా (2021-23) బాధ్యతలు స్వీకరించ బోతున్న మానవత్వం పరిమళించిన మంచి మనిషి  అంజయ్య చౌదరి లావు గారిని ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరూ మనసా, వాచా, కర్మణా స్వాగతిస్తున్నారు. మాటల్లో నిష్కల్మషం, ఆచరణలో నిజాయితీ, అంజయ్య చౌదరి లావు ఔన్నత్యానికి నిదర్శనం. కష్టపడటం కాలంతో పరిగెత్తడం, అనుకున్న లక్ష్యం సాధించే వరకు అనునిత్యం అలుపెరగని పయనం సాగిస్తారు. తెలుగు వారి పట్ల ప్రేమ వారి సమస్యల పరిష్కారం కొరకు కడదాకా పోరాడే యోధుడు అంజయ్య చౌదరి లావు . డాలర్ల వేటలో మానవ సంబంధాలను మరుస్తున్న ఈరోజుల్లో ఖండాంతరాల అవతల కూడా కాసులకు అతీతంగా సేవలందించి అందరి మన్ననలను పొందుతున్న తెలుగుతేజం అంజయ్య చౌదరి లావు. తానా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయడం నిజంగా పర్వదినం. తన కుటుంబ శ్రేయస్సు కాకుండా అమెరికాలోని తెలుగువారు కుటుంబాలను కూడా తన కుటుంబంగా భావించి ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఏ సమయంలో వచ్చినా వెంటనే స్పందించి, వారికి కొండంత ధైర్యాన్ని కల్పించి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధంగా సేవ చేస్తున్న అంజయ్య చౌదరి లావు కి అభినందనలు. తెలుగువారి సేవలో పరమాత్మను సేవిస్తూ తన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకొని పోతూ తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకోవాలని అంజయ్య చౌదరి లావు లక్ష్యం . ఆ లక్ష్య సాధన కోసమే ఆయన నిరంతరం ఆరాటపడుతున్నారు.  

కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఉన్న పెద్దఅవుటుపల్లి గ్రామంలో లావు సాంబశివరావు – శివరాణి దంపతులకు 1971 మార్చి 27 న అంజయ్య చౌదరి జన్మించారు. తండ్రి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా విశాఖపట్నం లో పనిచేయడం వలన అంజయ్య చౌదరి చిన్నతనంలోనే బాబాయి లావు రంగారావు,పిన్నమ్మ  కోటేశ్వరమ్మ ల సంరక్షణలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా గన్నవరం లోని సెయింట్ జాన్స్ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడలోని గౌతమి రెసిడెన్షియల్ కళాశాలలో, ఉన్నత విద్య బీటెక్ బళ్ళారి లోను, ఎంటెక్ గుల్బర్గా కళాశాలలో పూర్తిచేశారు.

పూవు పుట్టగానే పరిమళించినట్లు గా అంజయ్య చౌదరి చిన్నతనం నుండే సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నారు. తరువాత 1988 లో అమెరికా వెళ్లి అట్లాంటాలో నివాసమున్నారు. 1997 లో అనకాపల్లి కి చెందిన నతాషా తో వివాహం జరిగింది. అంజయ్య చౌదరి లావు గారికి ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీకాంత్ చౌదరి, కుమార్తే  అక్షిణ శ్రీ చౌదరి.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ,వారికి ఆపన్నహస్తం అందించడంలోనే జీవిత పరమార్థం దాగి ఉన్నదని భావించే అంజయ్య చౌదరికి కుటుంబ ప్రోత్సాహం బాగా తోడయింది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ సహకారం తప్పక ఉంటుందనే అక్షరసత్యం నిజం చేస్తూ అంజయ్య చౌదరి లావు ప్రతి విజయం వెనుక వారి ధర్మపత్ని చేయూత, ప్రోత్సాహం ఉంది. ఆమె ప్రోద్బలంతోనే అంజయ్య చౌదరి సేవా కార్యక్రమాలకు ఎదురులేకుండా (తానా ఎమర్జెన్సీ అసిస్టెంట్స్ మేనేజ్‌మెంట్) తానా టీమ్ స్క్వేర్ అంజయ్య చౌదరి లావుగా పేరుపొందారు.

పేద ప్రజల గుండెచప్పుడు అంజయ్య చౌదరి లావు

పెద అవుటపల్లి పల్లి గ్రామంలో ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కలిగినా కార్పొరేట్ వైద్యులు వారి తలుపు తట్టి ఉచితంగా వారికి రోగాలు నయం చేస్తున్నారు. ఈ సామాజిక, ఆరోగ్య చైతన్యం వెనుక ఉన్నది ఒకే ఒక్కరు. ఆయనే అంజయ్య చౌదరి లావు. తన చుట్టూ ఉన్న సమాజం బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మి , సొంత లాభం కొంత మానుకొని స్వగ్రామానికి తోడ్పాటును అందించాలనే జన హితుడు ఆయన.

విజయవాడ మణిపాల్ హాస్పటల్ వైద్యబృందం సహకారంతో హృద్రోగ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గుండె వ్యాధులు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సహాయం అందించారు. జైపూర్ నుండి వికలాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలను తెప్పించి పంపిణీ చేయించారు.

తాను ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా తాను పుట్టి పెరిగి నడిచివచ్చిన దారిని మర్చిపోకుండా అందరినీ కలుపుకొని పోతూ తన స్వగ్రామం పెద్ద ఉటపల్లి అభివృద్ధికి నడుం బిగించిన అజాతశత్రువు అంజయ్య చౌదరి.

“ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుని కో మాల అని నమ్మి” ఎన్నో సేవా కార్యక్రమాలకు స్వయంగా అంజయ్య చౌదరి విరాళం అందించారు. మిత్రులు సహృదయులు వద్ద నుండి విరాళాలు సేకరించి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. గ్రామంలోని అనాధ పిల్లలకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. నిరు పేద పిల్లలకు కానుకలు, ఆటబొమ్మలు పంపిణీ, విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ, అనాధ శరణాలయం లో అన్నదానం, గ్రామంలో మొక్కలు నాటడం చేపట్టారు. తానా  స్కాలర్షిప్పులు వంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించారు. భారతదేశంలో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. గ్రామాభివృద్ధి లో చౌదరి అలుపెరుగని కృషి చేస్తున్నారు.

పెద్ద అవుటపల్లి గ్రామంలో మొదలైన అంజయ్య చౌదరి లావు సామాజిక సేవా పరిమళం మెల్లమెల్లగా అమెరికా అంతా వ్యాపించింది . అమెరికన్ రెడ్ క్రాస్ మరియు ఇతర జాతీయ ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాల నిర్వహణ లో అంజయ్య చౌదరి చురుగ్గా పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా జరిగిన అనేక రక్తదాన శిబిరాల్లో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అక్కడ నిర్వహించే వైద్య శిబిరాలు తగిన హాల్స్ ఏర్పాటు చేయడం, కార్యకర్తలను సమకూర్చటం, ధన సహాయం చేయడం, వైద్యం కోసం వచ్చిన వారికి తగిన వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు.

“ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న ” అనే నానుడిని ప్రగాఢంగా విశ్వసిస్తూ సాటి మనిషికి సాయం పడటం వారికి ప్రేమను పంచడం ఇవే నా జీవితాన్ని నడిపించే మూల సూత్రాలంటారు అంజయ్య చౌదరి లావు.

అన్నదానం

“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టి వారిని ఆదుకోవడం కన్నా మంచి పని ఏమి ఉంటుందని భావించారు అంజయ్య చౌదరి లావు. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తి స్తోమతను బట్టి  గత 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక వృద్ధ శరణాలయాల్లో అన్నదానం చేస్తూ అందరి అభిమానాన్ని అంజయ్య చౌదరి లావు చూరగొన్నాడు.

పదవులకే వన్నెతెచ్చిన అంజయ్య చౌదరి లావు

అంజయ్య చౌదరి లావు పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి. వరించిన ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చాడు. అతి చిన్న వయసులోనే అనేక పదవులు చేపట్టారు. తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ గా మొదలైన వారి ప్రయాణం నేడు తానా అధ్యక్షులు వరకూ వచ్చింది.

“తానా” టీమ్ స్క్వేర్ చైర్మన్ (2011-13)
“తానా” సంయుక్త కోశాధికారి (2013-15)
“తానా” టీమ్ స్క్వేర్ మెంటర్ చైర్మన్ (2013 -15)
“తానా” కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ (2015 – 17)
“తానా’ టీమ్ స్క్వేర్  కో చైర్ (2015 – 17)
“తానా” జనరల్ సెక్రటరీ (2017 – 19)
“తానా” టీమ్ స్క్వేర్ చైర్మన్ (2017 -19)
“తానా” ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (2019 – 21)
“తానా” ప్రెసిడెంట్ (2021 -23)

తెలుగు వారి సేవలో

అమెరికాలో ఉద్యోగం చేస్తూనే అంజయ్య చౌదరి లావు అక్కడి తెలుగు వారి సమస్యల పరిష్కారం కోసం తానా సంస్థలో సభ్యులుగా చేరారు. తెలుగువారు హత్యకు గురైనా, రోడ్డు ప్రమాదాల్లో మరణించినా వారి మృతదేహాలను ఇండియాకు తీసుకురావడంలో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని దగ్గరుండి అన్ని తానై పూర్తి చేసేవారు. ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఇండియా నుండి అమెరికా కి వెళ్లి ఇబ్బందులకు గురైతే వారికి అండగా నిలిచారు. హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, ఫేస్బుక్ సమాచారం ఆధారంగా ఇబ్బందుల్లో ఉన్న వారి సమాచారాన్ని తెలుసుకొని వారికి సహాయపడేవారు.

కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా సుమారు 100 కు పైగా సేవా కార్యక్రమాలు అమెరికా వ్యాప్తంగా చేశారు. ముఖ్యంగా బోన్మారో డ్రైవ్ , బ్లడ్ డ్రైవ్, ఫుడ్ అండ్ టాప్ డ్రైవ్, ట్రైనింగ్ వర్క్ షాప్, టాక్స్ సెమినార్లు, ఫైనాన్స్ ప్లానింగ్ సెమినార్ నిర్వహించి ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొనేలా తన వంతు సహాయం అందించారు. ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకునేందుకు 2008వ సంవత్సరంలో ప్రారంభించబడిన టీమ్ స్క్వేర్ సంస్థకు చైర్మన్ గా పనిచేసిన కాలంలో అంజయ్య చౌదరి చేసిన సేవలు అనిర్వచనీయం. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ సుమారు 600 మంది కార్యకర్తలను సంధాన పరుస్తూ సేవా యజ్ఞాన్ని కొనసాగించారు.

రానున్న రోజుల్లో “తానా” కీర్తి బావుటా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిపేందుకు, తానా యాష్చంద్రిక లను దశదిశలా వ్యాపింప చేసేందుకు అంజయ్య చౌదరి లావు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఆశిద్దాం…

 

Tags
  • Anjaiah Chowdary Lavu
  • oath
  • President
  • TANA
  • Telugu Association

Related News

  • Potluri Ravi Helps Student K Eranna For Higher Education

    TANA: విద్యార్థి ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం…

  • Nats Felicitates Damu Gadela

    NATS: దాము గేదెల కు నాట్స్ సత్కారం…

  • Adoption Of Highways In America Under Tana Mid Atlantic

    TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్-ఎ-హైవే’ విజయవంతం

  • Nats Online Yoga Workshop By Maittreyi

    NATS: నాట్స్ ఆధ్వర్యంలో ఫ్రీ యోగా, మెడిటేషన్ వర్క్‌షాప్

  • Tana Backpack Distribution In New Jersey

    TANA: న్యూజెర్సీ లో తానా బ్యాక్ ప్యాక్ వితరణ – ఫ్రీహొల్డ్ బరో స్కూల్ లో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

  • Trump Administration Plans Significant H 1b Visa Changes

    H1B Visa: హెచ్1బీ వీసాలపై యూఎస్ ఫోకస్.. అమెరికన్లకు అన్యాయం జరిగితే ఊరుకోం!

Latest News
  • C.R. Patil: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ
  • Dussehra: దసరా ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
  • Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
  • Revanth Reddy: యంగ్‌ ఇండియా స్కూళ్లకు మద్దతు తెలపండి : సీఎం రేవంత్‌ రెడ్డి
  • Vice President:ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
  • Ravi Teja: “లిటిల్ హార్ట్స్” సినిమాకు సెలబ్రిటీల ప్రశంసల వెల్లువ
  • K-Ramp: “K-ర్యాంప్” దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్
  • Kishkindhapuri: కిష్కింధ‌పురిలో రామాయ‌ణం రిఫ‌రెన్స్
  • Sambharala Yeti Gattu: సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు (SYG) యాక్షన్ సీక్వెన్స్
  • TG Viswa Prasad: ‘మిరాయ్‌’ ఎక్స్‌ట్రార్డినరీ ఫాంటసీ విజువల్ వండర్ – నిర్మాత టిజి విశ్వప్రసాద్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer