అమెరికాలో అమూల్ పాలు

అమెరికాలో అమూల్ మిల్క్ బ్రాండ్‌ను ఆ సంస్థ ప్రారంభించింది. యూఎస్ వచ్చాం అనే ట్యాగ్ లైన్‌తో అమూల్ ఒక ప్రకటన ఇచ్చింది. అమెరికాలో అమూల్ ఉత్పత్తులు అమ్మేందుకు మిషిగన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోషియేషన్ (ఎంఎంపీఏ)తో అమూల్ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) తాజాగా పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది. మిషిగన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోషియేషన్ నేతృత్వంలో పాల సేకరణ, ప్రాసెసింగ్ చేపడుతుంది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికాలో అమూల్ ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండిరగ్, సేల్స్ తదితర వాటినన్నింటినీ ఈ బాగస్వామ్య సంస్థ చూసుకోనుంది.