Zee Telugu: జీ తెలుగు వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ గం గం గణేశా..

హైదరాబాద్, 29 ఆగస్టు 2025: ఆకట్టుకునే సీరియల్స్, అలరించే రియాల్టీ షోలతో అలరిస్తున్న జీ తెలుగు (Zee Telugu) ఈ వినాయక చవితికి ప్రేక్షకులకు మరింత వినోదం పంచేందుకుమరో ప్రత్యేక కార్యక్రమంతో వచ్చేస్తోంది. భక్తి, వినోదం కలగలసిన జీ తెలుగు అందిస్తున్నగణేష్ చతుర్థి సంబరం గం గం గణేశా. సంస్కృతి, సంప్రదాయం మేళవించిన ఘనమైన వేడుక..వెండితెర, బుల్లితెర తారల సందడితో సరదాగా సాగిన గం గం గణేశా ఈ ఆదివారం సాయంత్రం 6గంటలకు, మీ జీ తెలుగులో!
జీ తెలుగు నటీనటులు అందరూ కలిసి ఈ వినాయక చవితిని ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. యాంకర్ రవి, వర్షిణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలోహీరోయిన్ సదా, హీరో మంచు మనోజ్ ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు. నటీనటుల గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమయ్యే ఈ వేడుక ఆద్యంతం వినోదం పంచే ప్రదర్శనలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచులతో సరదాగా సాగనుంది. సదా, మంచు మనోజ్ మధ్య జరిగే డైలాగ్ వార్, డ్రామా జూనియర్స్ చిచ్చర పిడుగులు ఇరియా సుబ్రమణ్యం, హర్విన్ రెడ్డి స్కిట్స్, సీరియల్ తారల అల్లరి, ఆటపాటలతోపాటు వినాయక చవితి సంబరాలు ఘనంగా జరుపుకోనున్నారు. బుల్లితెర, వెండితెర తారల ఆటపాటలు, అల్లరితో వైభవంగా జరగనున్న వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం ‘గం గం గణేశా’ సంబరాన్ని మీరూ జీ తెలుగు వేదికగా మిస్ కాకుండా చూసేయండి!
వినాయక చవితి ప్రత్యేక ఉత్సవం గం గం గణేశా.. ఈ ఆదివారం, 6గంటలకు, మీ జీ తెలుగులో..తప్పక చూడండి!