Peddi movie: మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశ.. రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Peddi movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ (RC16). ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా చిత్ర యూనిట్ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యం కానుంది.
వాయిదాకు కారణాలు:
నిజానికి ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, షూటింగ్ ఇంకా కొంత భాగం బ్యాలెన్స్ ఉండటం, భారీ ఎత్తున ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం పడుతుండటంతో విడుదలను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 30వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు తన ‘X’ వేదికగా అధికారికంగా వెల్లడించారు.






