Peddi: ఏప్రిల్ 30న రిలీజ్ కానున్న పెద్ది
గేమ్ ఛేంజర్(Game changer) డిజాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) చేస్తున్న సినిమా పెద్ది(peddi). ఉప్పెన(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchi babu Sana) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న పెద్ది సినిమాలో రామ్ చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తోంది.
పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాను చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా వాయిదా పడుతుందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడా వార్తలను నిజం చేస్తూ చిత్ర డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు.
పెద్ది సినిమాను ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు డైరెక్టర్ బుచ్చిబాబు ట్వీట్ చేశారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తవకపోవడం వల్లే పెద్ది సినిమా ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో బుచ్చిబాబు చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో తన పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోవాలని చూస్తున్నారని తెలుస్తోంది.
https://x.com/BuchiBabuSana/status/2018999596274643120?s=20






