Upasana: మాది మగధీర లవ్ స్టోరీ కాదు
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), రామ్ చరణ్(ram charan) కు ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని చెప్తోంది ఉపాసన. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఎవరికి తెలియని కొన్ని విషయాలను వెల్లడించింది. రామ్ చరణ్ కు సౌత్ ఇండియన్ ఫుడ్ ఇష్టమని, రసం రైస్ అంటే ఇంకా ఇష్టమని, ఎప్పుడు చూసినా రసం, రసం అంటుంటాడని చెప్పింది ఉపాసన(Upasana).
వరల్డ్ లోని బెస్ట్ రెస్టారెంట్ కు వెళ్లినా తాను మెనూ మొత్తం చూసి ఆఖరికి ఇండియన్ ఫుడ్డే కావాలంటాడని, రోజులో ఓ పూట మాత్రం కచ్ఛితంగా తనకు ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందేనని, అది కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే ఉండాలని ఉపాసన చెప్పింది. తమ ఇంట్లో చిరంజీవి దోశ చాలా స్పెషల్ అని, ఆ దోశను ఆవకాయతో తింటే చాలా బావుంటుందంటోంది ఉపాసన.
రామ్ చరణ్ కు తాను ఐస్క్రీమ్ పరీక్ష పెట్టానని, ప్రేమలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫేమస్ ఐస్క్రీమ్ కావాలంటూ చరణ్ కు టెస్ట్ పెట్టానని, చరణ్ ఆ టెస్ట్ లో పాసయ్యాడని, తమది మగధీర(magadheera) లవ్ స్టోరీ కాదని, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని ఉపాసన చెప్పింది. ఇక చరణ్ విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది(Peddi) అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు.







