Mukesh Ambani: తిరుమల శ్రీవారికి అంబానీ భారీ విరాళం .. రూ.100 కోట్లతో
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం ఆయన తిరుమల (Tirumala)తో పాటు కేరళలోని గురువాయూర్, రాజస్థాన్ (Rajasthan) లోని నాథ్ద్వారా ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయాల తరఫున చేపట్టే వివిధ సేవా కార్యక్రమాలకు భూరి విరాళాలను ప్రకటించారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవ పూర్తయ్యాక ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో నూతన శాటిలైట్ కిచెన్ (New satellite kitchen) (వంటశాల) నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు. నిత్యం 2లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలను తయారు చేసేందుకు వీలుగా ఈ వంటశాలను నిర్మించనున్నారు. కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం మహాభాగ్యం అని రిలయన్స్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.






