శ్రావణ మాసం….తెలుగు సినిమాల వినోదాల తోరణం

ఆగస్టు వర్షాకాలంలో అదరగొట్టనున్న టాలీవుడ్ చిత్రాలు
సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుంటాయి. సంక్రాంతి పండుగ మిస్ అయితే ఏప్రిల్, మే నెలల్లో వచ్చే వేసవి సెలవులకు సిద్ధమౌతాయి. కానీ ఈ సారి వేసవికి సరైన సినిమాలు లేక బాక్సఆఫీస్ వెలవెలపోయింది. మళ్ళీ జూన్, జులై మాసాలలో థియేటర్లలో కాస్త సందడి మొదలైంది. జూన్ లో విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 ఏ డి’ రెవిన్యూ పరంగా రికార్డులు సృటించింది. ఇక జులై 12న విడుదలైన కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ నిరాశ పరిచింది. ఈ నెలాఖరులో ధనుష్ ‘రాయన్’, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’, రక్షిత్ అట్లూరి ‘ఆపరేషన్ రావణ్’, చిత్రాలు విడుదలయ్యాయి. అయితే చాలా వరకు నిర్మాతలు పండుగల అప్పుడు, సెలవుల్లో సినిమాలు రిలీజ్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం మంచి వర్షాలతో ఆగస్టులో షుమారు 13 సినిమాల వరకు విడుదల కాబోతున్నాయి. ఇందులో నాలుగు భారీ చిత్రాలు కావడం విశేషం. వీటిలో ఏయే సినిమాలు ఆడుతాయో, ఎంత మేర ఆకట్టుకుంటాయో తెలియదు కానీ అంతా ఒకేసారి పోటీగా వచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. శివమ్ భజే
అశ్విన్ బాబు హీరోగా గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శివం భజే’. ఈ చిత్ర దర్శకుడు అప్సర్. ఇటీవల విడుదలైన టైటిల్ ‘శివం భజే’ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక వైవిధ్యమైన కథతో ‘శివం భజే’. కొత్త కథ, కథనాలతో అప్సర్ దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. టైటిల్ కంటే ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభిస్తుంది. అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి లాంటి నటులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
2. బడ్డీ
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘బడ్డీ’’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న ‘‘బడ్డీ’’ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
3. తిరగబడరసామీ
యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందు తున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆగస్టు 2న ‘తిరగబడ్డార సామి’’ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
4. విరాజి
వరుణ్ సందేశ్ తన తదుపరి చిత్రానికి ఆగస్టు 2న సిద్ధమవుతు న్నాడు. అతని కొత్త ప్రాజెక్ట్‌కి వీరాజీ అనే పేరు పెట్టారు . మహా మూవీస్‌తో కలిసి మీడియా బ్యానర్‌పై మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మించారు , వైరాజీ ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయం అవుతున్నారు .
5. ఉషా పరిణయం
తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ దర్శకుల్లో కె. విజయ్ భాస్కర్ ఒకరు. విజయ్ భాస్కర్ అద్బుతమైన సృజనాత్మకత సామర్థ్యం ఉన్న డైరెక్టర్.ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రాలు చేయడంలో ఆయనకు మంచి పేరుంది. విజయ్ భాస్కర్ తీసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తన దర్శకత్వంలో రూపొందిన నువ్వే కావాలి,మన్మథుడు, మల్లీశ్వరి వంటి ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రాలు ప్రేక్షకుల లోబాగా ప్రాచుర్యం పొందాయి. మళ్లీ ఆయన స్వీయ దర్శకత్వంలో మరో సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ రాబోతుంది. ఉషా పరిణయం అనే టైటిల్ తో మరో ఫ్యామిలి ఎంటర్ టైనర్ ను విడదలకు సిద్దం చేశారు. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది చిత్రం ఉపశీర్షిక. ఈ చిత్రం కూడా ఆగష్టు 2న విడుదల కాబోతుంది.
6. కమిటీ కుర్రోళ్ళు
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్. ఎల్.పి, శ్రీరాధా దామో దర్ స్టూడియోస్ బ్యాన ర్స్‌పై రూపొందిన ‘కమి టీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆగస్ట్‌లో వచ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సందర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగస్ట్ 9న విడుదలవుతుంది.
7. 35 చిన్న కథ కాదు
రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ , సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకం పై ‘‘35-చిన్న కథ కాదు’’ నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.’’35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఆగస్ట్ 9న విడుదలవుతుంది.
8. ఆయ్
ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫన్ ఎంటర్‌టైనర్ ఆయ్ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.
9. అహో విక్రమార్క
బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ కథానాయకుడిగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 30న భారీ ఎత్తున తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు.
10. మిస్టర్ బచ్చన్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్, విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ ప్రేక్షకులని అల్టిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఆగస్ట్ 14న జరగనున్నాయి. రవితేజ స్లిక్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.
11. డబుల్ ఇస్మార్ట్
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఫస్ట్ టైం తెలుగులో ఫుల్ లెంత్ రోల్ పోషిస్తున్నారు. సంజయ్ దత్ తన వాయిస్ ని అందించడం ద్వారా అతని క్యారెక్టర్, మూవీకి పవర్ ఇచ్చారు. సంజయ్ దత్ తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావస్తుండగా, ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మాస్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో రెండు పాటలు, టీజర్ భారీ అంచనాలు నెలకోల్పాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
12. తంగలాన్
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘‘తంగలాన్’’ రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. ‘‘తంగలాన్’’ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ‘‘తంగలాన్’’ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
13. సరిపోదా శనివారం
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. బలహీనులపై తన ఆధిపత్యాన్ని చూపించే రూత్ లెస్ కాప్ గా సూర్య పరిచయమయ్యారు. ఈ కథ నుంచి శ్రీకృష్ణుడు (నాని) తన సత్యభామ (ప్రియాంక మోహన్)తో కలిసి నరకాసురుడు సూర్య)ను ఎదుర్కోవడానికి వస్తున్నట్లుగా ప్రజెంట్ చేయడం క్యూరియాసిటీని పెంచింది.ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌కు కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌కు కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 29న ఈ చిత్రం విడుదల కానుంది.