Roshan: రోషన్ సైలెంట్ గానే కానిచ్చేస్తున్నాడుగా!
మామూలుగా ఎవరి వారసులైనా ఇండస్ట్రీలోకి వస్తుంటే చాలా హడావిడి చేస్తుంటారు. తమ పరిచయాలు మొత్తం వాడి తమ వారసుల కోసం మంచి డైరెక్టర్ ను సెట్ చేయడం దగ్గర నుంచి క్యాస్టింగ్, బ్యానర్ ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ సీనియర్ హీరో శ్రీకాంత్(Srikanth) మాత్రం తన కొడుకు రోషన్(Roshan) విషయంలో అలాంటి ప్లాన్స్ ఏమీ చేయలేదు.
రోషన్ మొదటి సినిమాగా నిర్మలా కాన్వెంట్(Nirmala Convent) చాలా చిన్న ఏజ్ లోనే వచ్చింది. అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున(Nagarjuna) రూపొందించిన ఈ సినిమా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని రాఘవేంద్ర రావు(Raghavendra Rao) దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో రోషన్ లుక్స్, సాంగ్స్, శ్రీలీల(Sree Leela) డ్యాన్సులు అందరినీ మెప్పించాయి.
పెళ్లి సందడి(Pelli Sangani) వచ్చి ఇన్నేళ్లవుతున్నా రోషన్ నుంచి మరో సినిమా రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే రోషన్ సైలెంట్ గా ఉంటూనే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్న రోషన్, దాంతో పాటూ వైజయంతీ బ్యానర్(Vyjayanthi Banner)లో మరో సినిమాను ఒప్పుకున్నాడు. దాంతో పాటూ అశోక్ ముప్పా(Ashok Muppa) నిర్మాతగా ఓ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రోషన్ సైలెంట్ గా సినిమాలు చేయడం చూస్తుంటే తనను తక్కువ అంచనా వేయడానికి లేదని ఋజువవుతోంది.






