Kota: కోట శ్రీనివాసరావు గారు పోషించిన పాత్రలు చిరస్మరణీయం: రామ్ చరణ్

లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) గారి మృతి పట్ల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంతాపం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ కోట శ్రీనివాస రావు గారు లాంటి విలక్షణ నటుడిని కోల్పోయింది. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు. మన హృదయాల్లో నిలిచిపోయేలా ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కోట శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను.