రివ్యూ : ఇలాంటి కథలు ఎన్నిసార్లు తీస్తారన్నా? ‘పెద్దన్న’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్
నటీనటులు : రజనీకాంత్, నయనతార, కీర్తి సురేశ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, మీనా, ఖుష్బు తదితరులు
సంగీతం : డి. ఇమాన్, సినిమాటోగ్రఫీ : వెట్రీ, దర్శకత్వం : శివ
విడుదల తేది : 04.11.2021
ఈ ఏడాది సంక్రాంతి కి విడుదల కావాల్సిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ దీపావళి సంబరాలను బాక్సాఫీస్ వద్ద ప్రారంభించాడు. ‘అన్నాత్తే’ తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే ‘పెద్దన్న’ పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి భారీ బడ్జెట్ సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. ఈ సినిమాలో కీర్తి సురేశ్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ‘పెద్దన్న’హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య గురువారం(నవంబర్ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్దన్న’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
కథ:
తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రెసిడెంట్ వీరన్న(రజినీకాంత్). ఇతన్ని అందరూ పెద్దన్న అని పిలుస్తుంటారు. పెద్దగా చదువు లేదు. ఊర్లో ఎవరైనా అన్యాయం చేస్తే వారికి తగిన బుద్ధి చెబుతుంటాడు. ఊర్లో అతని చాలా మంచి పేరు, ప్రతిష్టలు ఉంటాయి. అంతే మంది శత్రువులు కూడా ఉంటారు. వీరన్నకు ఏకైక బలం, బలహీనత అతని చెల్లెలు కనక మహాలక్ష్మి(కీర్తి సురేశ్). అప్పటికే తండ్రి లేని వీరన్నకు మహాలక్ష్మి పుట్టినప్పుడే తల్లి చనిపోతుంది. అయితే చెల్లెల్ని తానే తల్లి, తండ్రిగా మారి ఎంతో ప్రేమతో పెంచుకుంటాడు. ఆమెకు ఏ కష్టం రానీయడు. పెద్ద చదువులు చదివిస్తాడు. ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటాడు. అదే సమయంలో లాయర్ పార్వతితో వీరన్నకు పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. మరో వైపు వీరన్నకు ఆ జిల్లాలో మరో పెద్ద దేవరాజ్(ప్రకాశ్‌రాజ్)తో అనుకోకుండా గొడవలు అవుతాయి. అయితే వీరన్న మంచి మనసు తెలుకున్న దేవరాజ్ మంచి మనిషిగా మారి తన తమ్ముడిని మహాలక్ష్మికి ఇచ్చి పెళ్లి చేయడానికి సంబంధం అడుగుతాడు. మంచి మనిషిగా మారిన దేవరాజ్ కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి వీరన్న కూడా సిద్ధపడతాడు.
అప్పటి వరకు అంతా నీ ఇష్టం అన్నయ్య అని చెప్పిన మహాలక్ష్మి పెళ్లి రోజు రాత్రి తను ప్రేమించిన అరవింద్‌తో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. విషయం తెలిసిన వీరన్నకు మనసు విరిగిపోతుంది. కానీ అలా మహాలక్ష్మి తను చెప్పినవాడిని చేసుకోకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వెనుక బలమైన కారణముందని వీరన్నకు తెలుస్తుంది. చెల్లెల్ని కలుసుకోవడానికి పార్వతి సాయంతో కోల్‌కతా వెళతాడు. కానీ అక్కడ తన చెల్లెలు కష్టాలు పడుతుంటుంది. భర్త పక్కనుండడు. అసలేం జరిగింది? ప్రేమించి, పెళ్లి చేసుకున్న తన చెల్లెలి భర్త ఏమయ్యాడో వీర్నకు అర్థం కాదు. తన చెల్లెల కష్టానికి ఎవరు కారణం అనే విషయాన్ని తెలుసుకుని ఆమె కాపురాన్ని బాగు చేయాలని వీరన్న ముందడుగు వేస్తాడు. ఈ ప్రయాణంలో వీరన్నకు తెలిసే నిజాలు ఏంటి? చివరకు వీరన్న చెల్లెలు కష్టానికి కారణం ఎవరు? తన చెల్లెలు కాపురాన్ని వీరన్న నిలబెట్టుకుంటాడా? కోల్‌కత్తాలో వీరన్న ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అనే విషయాలు తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే.
నటి నటుల హావభావాలు :
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వయసు పెరుగుతున్నా..నటించడం లోఅతని స్టామినా మాత్రం తగ్గడంలేదు. తనదైన స్టైల్, యాక్టింగ్‌తో ఇప్పటికీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘పెద్దన్న’కూడా పూర్తిగా రజనీకాంత్ జనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. గ్రామపెద్ద వీరన్న పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. తనదైన పంచ్ డైలాగ్స్, యాక్టింగ్‌తో సినిమా భారాన్ని మొత్తం తనపై వేసుకొని నడిపించాడు. తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం కూడా చేశాడు. ఇక వీరన్న చెల్లెలు కనకమహాలక్ష్మీ పాత్రలో కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రే కీలకం. కథను మలుపుతిప్పే కనకమ్ పాత్రలో కీర్తి పరకాయప్రవేశం చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుత నటనను కనబర్చింది. ఇక లాయర్ పార్వతిగా నయనతార తన పాత్రకు న్యాయం చేసింది. విలన్స్‌గా జగపతిబాబు, అభిమన్యు సింగ్ ఆకట్టుకున్నారు. మీనా, ఖుష్బూలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతివర్గం పనితీరు:
‘పెద్దన్న’కథను పక్కా రజనీకాంత్ ఇమేజ్‌కి సరితూగే విధంగా రాసుకున్నాడు దర్శకుడు శివ. రొటీన్ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ అంతా రజనీ అభిమానులు అశించే డైలాగ్స్, ఫైట్స్, స్టైల్‌తో ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథలో ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సింపుల్‌గా సాగుతుంది. వర్క్ విషయం కి వస్తే ముందు చెప్పినట్టు గానే తన గత సినిమాలతో పోలిస్తే పెద్దన్న విషయంలో మాత్రం బాగా డిజప్పాయింట్ చేస్తాడు. పరమ రొటీన్ కథ, కథనాలతో ఎక్కడా కూడా కొత్తదనం కోరుకునే ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయాడు. రజినీ కి వేరే మంచి కథ చేసి ఉంటే బాగుండేదెమో కానీ ఈ పెద్దన్న సినిమాతో శివ వర్క్ బాగా డిజప్పాయింట్ చేస్తుంది. అలాగే డి ఇమాన్ సంగీతం బాగుంది. పాటలు అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఆకట్టుకుంటాయి. ఇంకా సినిమాటోగ్రఫీ పర్వాలేదు అని చెప్పొచ్చు. అలాగే టెక్నీకల్ యూనిట్ లో పలు సీన్స్ బెటర్ వి ఎఫ్ ఎక్స్ పెట్టి ఉండాల్సింది. పలు సన్నివేశాల్లో అవి క్లియర్ గా తెలిసిపోతున్నాయి. సన్ పిక్చర్స్ వారి హై లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి.
విశ్లేషణ :
కథలో కొత్తదనం లేదు అనుకుంటే కథనంలో కూడా ఎక్కడా కొత్తదనం కనిపించదు. సినిమా అంతా దాదాపు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఆడియెన్స్ కి ఇట్టే అర్ధం అయ్యిపోతుంది. ఈ విషయం లో మాత్రం శివ బాగా డిజప్పాయింట్ చేశారు. అలాగే ఎమోషన్స్ పరంగా కూడా బ్లైండ్ తప్పులు లాజిక్స్ మిస్సవ్వడం కూడా గట్టిగానే ఉంటాయి. ఇంకా సినిమాలో విలన్స్ అనవసర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలానే హీరోయిన్ రోల్ కూడా ఏదో మొక్కుబడిగా ఉండాలి అన్నట్టు ఉంటుంది తప్పితే సినిమాలో అంత ఎఫెక్టివ్ గా ఎక్కడా అనిపించదు. ఇంకా రొటీన్ పాత నరేషన్ వల్ల ఆడియెన్స్ కి ఎక్కడా కూడా థ్రిల్ అయ్యే అనుభూతులు కూడా పెద్దగా గుర్తుండవు. ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఈ “పెద్దన్న” రజినీ వీరాభిమానులను బాగానే ఆకట్టుకోవచ్చు కనీస కొత్త ఎలిమెంట్స్ లేకపోవడం కామన్ ఆడియెన్ ని బాగా డిజప్పాయింట్ చేస్తుంది. జస్ట్ ఒక్క రజినీకాంత్ కోసమే మిగతా సినిమా ఎలా ఉన్నా పర్లేదు అనుకున్న వారు మాత్రమే అయితే ఈ సినిమా చూడొచ్చు. మొత్తంగా అయితే పెద్దన్న అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకోలేదు.