Allu Kanakaratnamma: అల్లు అరవింద్ తల్లి మృతిపై ప్రధాని సంతాపం

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్(allu aravind) తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య(allu ramalingaiah) భార్య అల్లు కనకరత్నమ్మ(allu kanakaratnamma) రీసెంట్ గా తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వయసు మీద పడి పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె గత శనివారం తెల్లవారుఝామున 2 గంటల ప్రాంతంలో తుది శ్వాసను విడిచారు.
ఆమె మృతి పట్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియచేయగా తాజాగా అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సంతాపాన్ని వ్యక్తం చేయడంతో పాటూ అల్లు కుటుంబానికి సానుభూతిని తెలిపారు. కనకరత్నమ్మ గారి మరణ వార్త తనకు బాధను కలిగించిందని, ఆమె మరణం అల్లు కుటుంబానికి చాలా తీరని లోటని అన్నారు.
ఫ్యామిలీ ఎదుగుదలలో ఆమె పాత్ర, ఆమె చూపిన దయ, కరుణ, ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతాయని, ఆమె తన కళ్లను దానం చేయడం ఎంతో గొప్ప విషయమని, చనిపోతూ కూడా మరో లైఫ్ కు వెలుగునిచ్చి చాలా మందికి ఇన్‌స్పైరింగ్ గా నిలిచారని, ఇలాంటి టఫ్ టైమ్ లో అల్లు ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానంటూ మోదీ సందేశాన్ని పంపగా, ప్రధాని తెలిపిన సందేశానికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు చెప్పారు.