NTRNeel: మారణహోమానికి సిద్ధమైన తారక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరో ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కర్ణాటకలో మొదలై ఓ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుని ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తుండగా, ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నాడని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
చెప్పినట్టుగానే ఎన్టీఆర్ ఎల్లుండి నుంచి ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి కర్ణాటక బయలుదేరుతూ ఎయిర్పోర్టులో నిర్మాతలతో మాట్లాడుతూ కనిపించాడు. ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా సన్నగా, మరింత స్టైలిష్ గా కనిపించాడు. జాకెట్ వేసుకుని బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని తారక్(Tarak) మునుపెన్నడూ లేనంత స్టైలిష్ అవతారంలో దర్శనమిచ్చాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చాలా కొత్తగా చూపించనున్నాడట ప్రశాంత్ నీల్. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాను అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా నీల్ తెరకెక్కిస్తున్నాడట. సెట్స్ లో ఎన్టీఆర్ అడుగు పెడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. మారణహోమానికి ముందు ప్రశాంతత అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
https://x.com/NTRNeelFilm/status/1913821383689396653






