Qatar: ఖతార్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం
ప్రపంచ వేదికలపై తెలుగువారు ప్రతిభ చూపడానికి ఎన్టీఆర్, చంద్రబాబు కారణమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) అన్నారు. టీడీపీ (TDP) ఎన్నారై విభాగం ( గల్ఫ్) ఆధ్వర్యంలో ఖతార్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా భీమిలి, కల్యాణదుర్గం ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అమిలినేని సురేంద్ర బాబు(Surendra Babu) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వెలువరించిన తారకరామం, చంద్రబాబు (Chandrababu) జీవిత ప్రస్థానంపై విక్రమ్ పూల రచించిన మహాస్వాప్నికుడు పుస్తకాల్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఖతార్ విభాగం అధ్యక్షుడు జి.రమణయ్య తదితరులు పాల్గొన్నారు.






