Niharika: సింపుల్ లుక్ లో అదరగొడుతున్న కొణిదెల వారమ్మాయి

కొణిదెల వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల(Niharika konidela) ముందుగా వెబ్‌సిరీస్ లు చేసింది. ఆ తర్వాత యాంకర్ గా మారింది. కొన్నాళ్ల పాటూ యాంకర్ గా కొనసాగిన నిహారిక ఒక మనసు(Oka Manasu) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంటరైన నిహారిక మొదటి సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది.
మొదటి సినిమాతో మంచి నటిగా పేరైతే తెచ్చుకుంది కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఒక మనసు తర్వాత కూడా నిహారిక పలు సినిమాలు చేశారు. కానీ హీరోయిన్ గా మాత్రం నిహారిక అనుకున్న స్టార్‌డమ్ అందుకోలేకపోయింది. ఓ వైపు నటిగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉంది నిహారిక.
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. తాజాగా నిహారిక ఓ ఫోటోషూట్ ను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో నిహారిక మల్టీ కలర్ డిజైనర్ వేర్ ధరించి సింపుల్ హెయిర్ స్టైల్, మేకప్ తో మరింత అందంగా కనిపించింది. నిహారిక షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.