Nara Rohit: మెగా ఫోన్ పట్టనున్న యంగ్ హీరో?

నారా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్(nara Rohit) మొదటి సినిమా బాణం(Banam)తోనే నటుడిగా మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా రోహిత్ స్టోరీలను ఎంచుకోవడం ద్వారా ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోహిత్, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో కొన్ని కోర్సులు కూడా చేశాడు.
కెరీర్ స్టార్టింగ్ లో యాక్టివ్ గా సినిమాలు చేసిన రోహిత్ ఆ తర్వాత స్పీడు తగ్గించాడు. గత ఆరేళ్లుగా రోహిత్ నుంచే మూడు సినిమాలు మాత్రమే వచ్చాయంటే అతనెంత స్లోగా సినిమాలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ప్రతినిధి2(prathinidhi2) తో ప్రేక్షకుల్ని పలకరించి రోహిత్, ఈ ఇయర్ భైరవం(bhairavam), సుందరకాండ(sundarakanda) సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చాడు.
ఇకపై కెరీర్లో వరుస పెట్టి సినిమాలు చేస్తానని సుందరకాండ ప్రమోషన్స్ లో చెప్పిన రోహిత్, ఇప్పుడు మెగా ఫోన్ పట్టి డైరెక్టర్ గా మారాలని చూస్తున్నాడట. హీరోగా తాను అఛీవ్ చేయలేనిది డైరెక్టర్ గా సాధించాలని ఆశపడుతున్నాడట. ఈ నేపథ్యంలోనే తన మనసులోని భావాల్ని పేపర్ పై పెట్టి సినిమా చేయాలని రోహిత్ అనుకుంటున్నాడని, దానికి అతని ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలేంటన్నది తెలియాల్సి ఉంది.