Nagarjuna Naga Chaitanya: రిస్క్ చేస్తున్న తండ్రీ కొడుకులు

అక్కినేని హీరోలు నాగార్జున(Nagarjuna), నాగ చైతన్య(Naga Chaitanya) ఇప్పుడు తమ మైల్ స్టోన్ సినిమాల కోసం రిస్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ మైలు రాయి సినిమాలైన నాగ్100(Nag100), ఎన్‌సీ25(NC25) సినిమాలను తమిళ డైరెక్టర్లతో చేయనున్నట్టు వస్తున్న వార్తలు అక్కినేని ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్నాయి. గత కొంత కాలంగా తమిళ డైరెక్టర్లతో తెలుగు హీరోలు చేసిన సినిమాలేవీ మంచి ఫలితాన్నివ్వలేదు.
నాగ చైతన్య గతంలో వెంకట్ ప్రభు(venkat prabhu) తో చేసిన కస్టడీ(Custody) సినిమా కూడా చైతూకి తీవ్ర నిరాశనే మిగిల్చిన సంగతి తెలిసిందే. ఇదంతా తెలిసి కూడా మళ్లీ తమిళ డైరెక్టర్లతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు తండ్రీ కొడుకులు. నా సామిరంగ(naa samiranga) సినిమా తర్వాత నాగార్జున సోలో హీరోగా సినిమా చేసింది లేదు. ఇప్పుడు నాగ్ తన 100వ సినిమాను తమిళ డైరెక్టర్ రా. కార్తీక్(Ra. karthik) దర్శకత్వంలో చేయనున్నారని, ఇప్పటికే డిస్కషన్స్ కూడా అయ్యాయని, ఆగస్టులో నాగ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గురించి అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్సుందని అంటున్నారు.
దీంతో పాటూ నాగ చైతన్య కూడా ప్రస్తుతం కార్తీక్ దండు(Karthik Dandu) తో చేస్తున్న సినిమా పూర్తయ్యాక తన 25వ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ పి.ఎస్ మిత్రన్(PS Mithran) తో చేయడానికి రెడీ అవుతున్నాడని, ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయని, ప్రస్తుతం సర్దార్2 సినిమాతో బిజీగా ఉన్న మిత్రన్ ఆ సినిమా పూర్తయ్యాక చేసే సినిమా చైతూతోనే అని, మిత్రన్ గత సినిమాల మాదిరే ఇది కూడా థ్రిల్లర్ మూవీనే అని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. ఏదేమైనా తండ్రీకొడుకులు ఈ విషయంలో కాస్త ఆలోచించాల్సిందని, ఈ రిస్క్ తీసుకోకుండా ఉండాల్సిందని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.