Manchu Manoj: స్లిమ్ గా మారి స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న మంచు మనోజ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) బరువు తగ్గి స్లిమ్ గా మారారు. సన్నబడి స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ఆయన తన కొత్త సినిమా ‘మిరాయ్’ ప్రమోషన్స్ లో ఈ స్లిమ్ లుక్ లో కనిపిస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘మిరాయ్’ సినిమాలో మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
ఈ క్యారెక్టర్ యానిమేటెడ్ ఇమేజ్, డీటెయిల్స్ ఉన్న టీషర్టులు ధరించిన మంచు మనోజ్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘మిరాయ్’ సినిమా తన కెరీర్ కు మరో మంచి టర్న్ అవుతుందని మనోజ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ ఈ నెల 12న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.