Maisaa: రష్మిక మందన్న, రవీంద్ర పుల్లె ‘మైసా’కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న ‘మైసా’ (Maisaa) అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం ఫేం జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా జేక్స్ బిజోయ్ ట్రైబల్ వాయిద్యాలతో రీరికార్డింగ్ చేస్తున్న విడియో రిలీజ్ చేశారు. సౌండింగ్ అదిరిపోయింది. మైసా మ్యూజికల్ గా గ్రాండ్ స్కేల్ లో వుండబోతుంది.మైసా గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. రష్మిక మందన్న ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవాతర్ లో కనిపిస్తుంది. ఈ చిత్రానికి సూర్య ‘రెట్రో’ సినిమాకి పని చేసిన శ్రేయాస్ పి కృష్ణ డీవోపీగా పని చేస్తున్నారు. యాక్షన్ ని ‘కల్కి 2898 ఏ డీ’ ఫేమ్ ఆండి లాంగ్ డిజైన్ చేస్తున్నారు. మరిన్ని ఎక్సైటింగ్ అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.