Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » I wish no budget film 1134 will become a big hit hero nandu at the trailer launch event

నో బడ్జెట్‌తో తీసిన ‘1134’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను –  హీరో నందు

  • Published By: techteam
  • August 6, 2023 / 09:36 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
I Wish No Budget Film 1134 Will Become A Big Hit Hero Nandu At The Trailer Launch Event

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి. రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.

Telugu Times Custom Ads

2 నిమిషాల 28 సెకనుల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు. ATM దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ట్రైలర్ చివరలో ‘అన్నీ నువ్వనుకునేలా జరిగితే మరి నేనెందుకురా ఇక్కడ’ అంటూ వచ్చిన డైలాగ్.. ఈ సినిమాలో ఏదో కొత్త కోణం చూపించబోతున్నారని స్పష్టం చేస్తోంది.         

సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. ప్రతి సన్నివేశం కూడా ఎంతో థ్రిల్ చేసేలా షూట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు.         

 *నందు మాట్లాడుతూ..* ‘నేను శరత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఫ్రెండ్‌షిప్ డే నాడు ఇలా రావడం నాకు ఆనందంగా ఉంది. ఈ రోజు నేను ఇక్కడకు రావడానికి కారణం మా స్నేహబంధమే. ఉడతా భక్తిలా నేను కూడా ఈ సినిమాకు ఏమైనా చేయాలని అనుకుని వచ్చాను. మాకు తరుణ్ భాస్కర్, అడివి శేష్ కుల దైవం వంటి వారు. వాళ్లే ఈ జీరో బడ్జెట్ చిత్రాలను ప్రారంభించారు. క్షణం, పెళ్లి చూపులు అలానే మొదలయ్యాయి. ఎంత బడ్జెట్‌తో సినిమాను తీశామని కాదు.. కంటెంట్ ఉందా? లేదా? అన్నది ముఖ్యం.  ఆ నమ్మకంతోనే శరత్ ఈ సినిమాను తీశాడు. నో బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

 *శరత్ చంద్ర తడిమేటి మాట్లాడుతూ..* ‘ఈ సినిమాను మేం ఎంతో ప్యాషన్‌తో నిర్మించాం. జీరో బడ్జెట్, నో బడ్జెట్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ చేశాం. ఈ సినిమాకు మేం ఏమీ ఖర్చు పెట్టలేదు. ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. ఇలాంటి డార్క్ సబ్జెక్ట్‌ను అందరూ చూడాలని ఎలాంటి వల్గారిటీ, బూతులు పెట్టలేదు. అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న స్కాంల గురించి వివరించాను’ అని అన్నారు.

రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

 

 

Tags
  • 1134
  • Budget Film
  • Nandu
  • Trailer Launch

Related News

  • Crime Comedy Baa Baa Black Sheep Released By Tarun Bhaskar

    Ba Ba Blackship: తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల

  • Etv Win 90s Kids Entertainment Announce Their Debut Project With A Grand Puja Ceremony

    ETV Win & 90’s Kids Movie: ఈటీవీ విన్ & 90s కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తొలి ప్రాజెక్టు గ్రాండ్ గా లాంచ్

  • Ram Charan S 18 Yrs Journey In Tollywood

    Ram Charan: రామ్‌ చరణ్‌ డిఫరెంట్‌ లుక్స్‌ మెరిపిస్తాయా?

  • Ashu Is Shining In A Skirt And A Blouse

    Ashu Reddy: లంగా ఓణీలో మెరిసిపోతున్న ఆషు

  • Akshaye Khanna As Shukracharya From Mahakali

    Mahakali: ‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

  • Dhanushs Idli Kottu Awarded With U Censor Certificate Locked Perfect Runtime Buckle Up For A Clean Family Entertainer

    Idlikottu: ధనుష్‌ ‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్

Latest News
  • Ba Ba Blackship: తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల
  • ETV Win & 90’s Kids Movie: ఈటీవీ విన్ & 90s కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తొలి ప్రాజెక్టు గ్రాండ్ గా లాంచ్
  • Telugu Thalli: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు.. అసలేం జరిగింది..?
  • Ram Charan: రామ్‌ చరణ్‌ డిఫరెంట్‌ లుక్స్‌ మెరిపిస్తాయా?
  • Jubilee Hills:జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎంపికపై నివేదిక ఇవ్వాలి: రేవంత్‌ రెడ్డి
  • Rajahmundry: రాజమహేంద్రవరం నుంచి తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం
  • DGP : స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తాం :  డీజీపీ శివధర్‌రెడ్డి
  • KTR: కేసీఆర్‌ పాలన స్వర్ణయుగం : కేటీఆర్‌
  • MLA Madhavaram: సునీత గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి: ఎమ్మెల్యే మాధవరం
  • Kadapa: కడపలో తెర వెనుక రాజకీయం.. డైలమాలో కూటమి..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer