Droupadi Murmu: తన్వి ది గ్రేట్ చిత్రాన్ని వీక్షించిన రాష్ట్రపతి

అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తన్వి ది గ్రేట్ (Tanvi the Great) . తాజాగా ఈ చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) వీక్షించారు. రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో ఆమె కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. రాష్ట్రపతితో పాటు చిత్రబృంద సభ్యులు ఈ ప్రదర్శనను వీక్షించారు. భారత త్రివిధ దళాల అధిపతి సుప్రీం కమాండర్ (Supreme Commander) మా సినిమాను చూడడం మాకు గర్వంగా ఉంది. సినిమా పూర్తయ్యాక చివర్లో ఆమె చప్పట్లు కొట్టడం చూసి నా కళ నిజమైందని అనుకున్నాను. ఒక దర్శకుడిగా ఇంతకు మించి ఏం ఆశించగలను అంటూ అనుపమ్ ఖేర్ (Anupam Kher ) ఆనందం వ్యక్త ం చేశారు.