Rajamouli: అభిమానిపై ఫైర్ అయిన రాజమౌళి

ఈ మధ్య సెలబ్రిటీలకు అసలు ఏ మాత్రం స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ వారిని వదిలిపెట్టడం లేదు. ఆ అభిమానం ఇప్పుడు మరీ కట్టలు తెంచుకుంది. అందుకే సమయం, సందర్భం ఏంటనేది కూడా ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కోటా శ్రీనివాసరావు(Kota Srinivasarao) మరణం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. దీంతో ఆయనకు నివాళులర్పించేందుకు టాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది.
అందులో భాగంగా కోటాకు తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన రాజమౌళి(Rajamouli) ఓ అభిమానిపై ఫైర్ అయ్యారు. కోటాకు నివాళులర్పించి, ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పి ఎమోషనల్ అయి,ఆ తర్వాత తిరిగి వెళ్తున్న అతన్ని ఒక అభిమాని సెల్ఫీ అడగ్గా, జక్కన్న సున్నితంగా అతన్ని తిరస్కరించి వేగంగా కారు వైపుకు వెళ్తుండగా, సదరు అభిమాని కూడా జక్కన్నకు అడ్డుపడి సెల్పీ తీసుకోవడానికి ట్రై చేశాడు. దీంతో అసహనానికి గురైన రాజమౌళి ఎక్కడికొచ్చి ఏం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఆ తర్వాత కాసేపటికి అక్కడికి వచ్చిన జూ. ఎన్టీఆర్(Jr ntr) కోటాకు నివాళులర్పించి, కోటా గురించి మాట్లాడి, అతని కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్న టైమ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్(Jai Ntr) అంటూ నినాదాలు చేశారు. అయితే అక్కడ వెంటనే అప్రమత్తమైన ఎన్టీఆర్ అలా అనొద్దంటూ వారిని ఆపి జై కోటా(Jai kota) అని నినాదం చేసి వెళ్లిపోగా ఇప్పుడు ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.