Prabhas: ప్రభాస్ కు నో బన్నీకి ఎస్.. తెలుగుపై దీపిక లవ్

ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో నటించడానికి ముందుకు వచ్చేవారు కాదు. చాలామంది హీరోయిన్లను తీసుకురావడానికి మన డైరెక్టర్లు ఎన్నో సందర్భాల్లో ప్రయత్నాలు చేసి విఫలమైన రోజులు ఉన్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో సైతం నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు కాస్త నామోషీగా ఫీల్ అయ్యేవారు. కానీ కాలం మారడం తెలుగు సినిమాలు ఎక్కువగా దేశంలో ప్రభావం చూపించడంతో తెలుగు వైపు బాలీవుడ్ చూస్తోంది. దీపికా పదుకొనే వంటి హీరోయిన్లు తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రియాంక చోప్రా కూడా ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు పక్కన నటిస్తోంది. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లు సైతం తెలుగులో అవకాశం వస్తే చాలు అన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలో నటించేందుకు దీపిక ఫైనల్ అయినా సరే కొన్ని కారణాలతో ఆమెను సందీప్ రెడ్డి వంగ పక్కన పెట్టాడు. ఆమె బిహేవియర్ తో పాటుగా రెమ్యూనరేషన్ కూడా భారీగా అడగటంతో దీపిక వద్దని తేల్చేశాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో దీపిక నటించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని, కాంబినేషన్ బాగుంటుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే అది కుదరలేదు. అయితే ప్రభాస్ సినిమాకు నో చెప్పిన దీపిక.. అల్లు అర్జున్ సినిమాకు మాత్రం ఎస్ చెప్పింది. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో వస్తున్న సినిమాలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. దీపిక ఈ సినిమా విషయంలో రెమ్యూనరేషన్ పెద్దగా డిమాండ్ చేయలేదని కూడా టాక్. ఈ సినిమాలో దీపికతో పాటుగా మరో హీరోయిన్ కూడా నటించే ఛాన్స్ ఉంది.