Ashu Reddy: గ్లామర్ ట్రీట్ తో పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్న అషు రెడ్డి

జూనియర్ సమంత(Jr. Samantha)గా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి(Ashu Reddy) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్(biggboss) కు వెళ్లి తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. బిగ్ బాస్ కు వెళ్లొచ్చాక పలు షో లకు హోస్టింగ్ చేస్తూ బిజీగా మారిన అషు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే అషు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయన పేరుని తన ఒంటిపై టాటూ కూడా వేయించుకుంది. ఇవాళ పవన్ బర్త్ డే సందర్భంగా ఆ టాటూ కనిపించేలా ఓ కొత్త ఫోటో షూట్ తో అషు దర్శనమిచ్చింది. వైట్ కలర్ డిజైనర్ డ్రెస్ ధరించిన అషు, ఆ డ్రెస్ లో మరింత అందంగా కనిపించగా, సైడ్ యాంగిల్ లో చెస్ట్ పక్కన ఉన్న ఆ టాటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం అషు రెడ్డి కొత్త ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.