Sree Leela: శ్రీలీల ముందు పెద్ద సవాలు
సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలకు టాలీవుడ్ లో కొత్త దారి చూపించిన సినిమాగా అరుంధతి(arundhathi)కి ఎంతో గొప్ప పేరుంది. హార్రర్, థ్రిల్లర్, ఎమోషన్స్ అన్నింటినీ సమంగా చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమాకు నార్మల్ ఆడియన్స్ నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలొచ్చాయి. ఈ సినిమా తర్వాతే అనుష్క(anushka) స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఇప్పుడంతా వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లోనే అరుంధతిలోని వీఎఫ్ఎక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. అలాంటి మాస్టర్ పీస్ మూవీని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. హార్రర్ సినిమాలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉండటంతో ఈ మూవీని రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఈ రీమేక్ లో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల(Sree Leela), అనుష్క పాత్రలో కనిపించనుందంటున్నారు. అసలే వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది శ్రీలీల. అనుష్క లాగా శ్రీలీల ఏమైనా గొప్ప పెర్ఫార్మరా అంటే అదీ లేదు. ఇలాంటి టైమ్ లో అరుంధతిని రీమేక్ చేయడానికి ఒప్పుకుంటే శ్రీలీలకు అది చాలా పెద్ద సవాలే అవుతుంది. ఎందుకంటే అరుంధతి లాంటి పాత్ర చేయడానికి ఎంతో మెచ్యూరిటీతో పాటూ రాజసం కూడా కావాలి. శ్రీలీల బాడీ లాంగ్వేజ్ కు ఆ పాత్ర పెద్దగా సూటవదని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.







