Zomato : ఉద్యోగులకు జొమాటో షాక్ … 500 మందికిపైగా

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) ఉద్యోగులను తొలగించింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న 500 మందికిపైగా ఉద్యోగుల్ని (Employees) ఇంటికి పంపింది. నియామకం చేపట్టిన ఏడాదిలోపే తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. జొమాటో తన క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ వృద్ధిలో మందగమనం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ పేరిట ఏడాది క్రితం ఫుడ్ డెలివరీ (Food delivery) ప్లాట్‌ఫామ్ నియామకాలు చేపట్టింది. కస్టమర్ సపోర్ట్ విభాగం కింద 1500 మందిని నియమించింది. వీరిలో చాలామందిని పేలవమైన పనితీరు, సమయపాలన పాటించని కారణంగా నోటీస్ (Notice) పీరియడ్ ఇవ్వకుండానే తొలగించింది. వీరిందరికీ ఒక నెల జీతాన్ని పరిహారం ఇచ్చిందని సంబంధిత వ్యక్తులు వెల్లడిరచారు. స్పష్టమైన వివరణ లేకుండా ఇంటికి పంపినట్లు వారు తెలిపారు.