Microsoft: వారంలో మూడు రోజులు రావాల్సిందే : మైక్రోసాఫ్ట్

వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలుకుతూ ఐటీ కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కూడా చేరింది. ఉద్యోగులు వచ్చే ఏడాది నుంచి వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసు (Office) కు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ విధానాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మాన్ పేర్కొన్నారు. తొలుత వాషింగ్టన్ (Washington) , రెడ్‌మండ్ (Redmond) కంపెనీ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులతో దీన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఇదే విధానం అమలవుతుందని వెల్లడిరచారు.