ఈ పురుగు ఖరీదు రూ.75 లక్షలు!

ఓ పురుగు విలువ రూ.75 లక్షలంటే నమ్మగలరా? అయితే మీరు స్టాగ్ బీటిల్ అనే కీటకం గురించి తెలుసుకోవాల్సిందే. ఇది అత్యంత అరుదైనదే కాదు, చాలా మంది దీన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీనివల్ల ఊహించని సంపద వస్తుందని విశ్వసిస్తారు. అందుకే దీనికి అంత ధర చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే జాతికి చెందినది. అటవీ పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. లండన్‌కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ పురుగు బరువు 2`6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది దాదాపు 3-7 సంవత్సరాలు జీవిస్తుంది. మగపురుగులు 35`70 మిల్లీమీటర్లు, ఆడపరుగులు 30`50 మి.మీ. పొడవు ఉంటాయి. ఈ కీటకాలను చికిత్స ల్లోనూ వాడతారు. ఈ పురుగులకు ఉన్న కొండీలు మగ జింకల కొమ్ములను పోలి ఉండటంతో వీటికి స్టాగ్ బీటిల్స్ అనే పేరొచ్చింది. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి.