ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా గిల్
ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా ఇందర్మిత్ గిల్ నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి గిల్ నియామకం అమల్లోకి రానున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సీనియర్ ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆర్థిక వృద్ధి, పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు తదితర కీలక అంశాల్లో ఆయా దేశాల ప్రభుత్వాలతో కలిసి గిల్ పనిచేస్తారు. గిల్ ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్లో ఆర్థిక, సమాన వృద్ధి, ఇన్స్టిట్యూషన్స్ విభాగాలకు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో డ్యూక్ విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా కూడా ఆయన పని చేశారు. మొత్తానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో భారతీయులకు ఘనమైన గౌరవమే దక్కుతున్నది. దీంతో కౌశిక్ బసు తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండో భారతీయుడిగా గిల్ నిలిచారు.






