విప్రో సంస్థకు మరో షాక్
ఐటీ దిగ్గజమైన విప్రో సంస్థకు మరో షాక్ తగిలింది. కంపెనీ డిజిటల్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న రాజన్ కోహ్లీ రాజీనామా చేశారు. నాయకత్వ స్థాయిలో భారీగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తప్పుకుంటున్న నేపథ్యంలో రాజన్ రాజీనామా చర్చనీయాంశమైంది. దాదాపు మూడు దశాబ్దాలుగా విప్రోతో ఆయనకు అనుబంధం ఉన్నది. ఈ బంధాన్ని ఆయన తెగతెంపులు చేసుకున్నారు. విప్రో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఇంజినీరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ బిజినెస్ లైన్ (ఇండియా) కు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. లక్ష మందికిపైగా ఉద్యోగులు గల టీమ్‌కు సారథ్యం వహిస్తున్నారు. కంపెనీ డిజిటల్ పరివర్తన బిజినెస్‌లో కీలకంగా వ్యవహరించిన రాజన్ కోహ్లీ, బాధ్యతలు చేపట్టగానే సంస్థ ఈసీవో థెర్రీ డెలాఫోర్డ్ కంపెనీలో సమూల మార్పులు చేశారు. సంస్థ అత్యంత ప్రధాన వ్యాపారాల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగాన్ని రాజన్ తీర్చిదిద్దారు. ఇతనికంటే ముందు పలువు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు విప్రో నుంచి నిష్క్రమించారు.






