వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ?
ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ పేమెంట్స్ పేరిట ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థని ప్రారంభించిన వాట్సాప్ తమ ప్లాట్‌ఫామ్‌పై లావాదేవీలను ప్రోత్సహించేలా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమచారం. అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంటుందా లేక తొలిసారి పేమెంట్ చేసేవారికి మాత్రమే వర్తిస్తుందా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఆఫర్ కేవలం యూపీఐ పేమెంట్స్‌కి మాత్రమే వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దీనిపై వాట్సాప్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని వాట్సాప్ బీటా తెలిపింది. ఈ కొత్త ఫీచర్‌పై వాట్సాప్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.






