వాట్సప్ మరో కొత్త ఫీచర్.. ఒకేసారి 32 మందితో
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ లో ఈ వారం నుంచి కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై ఆ యాప్‌లో వీడియో, వాయిస్ కాల్ల కోసం ఇతరులను ఆహ్వానించేందుకు ప్రత్యేక లింక్‌లను ఉపయోగించుకోవచ్చు. లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే కాల్లో చేరేందుకు ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. వాట్సప్‌లోని కాల్ సెక్షన్ లోకి వెళ్లి లింక్‌ను సృష్టించొచ్చు. ఇందుకోసం యాప్‌ను కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ ఫేస్బుక్ వేదికగా విషయాలను వెల్లడించారు. వాట్సప్‌లో ఒకే సారి 32 మంది గ్రూప్ వీడియోకాల్ మాట్లాడుకునేందుకూ వీలు కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత ప్రయోగ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి భారత్‌లో 48.75 కోట్ల మంది వాట్సప్ వినియోగదారులు ఉన్నారు.






