వాట్సాప్ మరో కీలక ఫీచర్.. ఒకేసారి 1024 మందితో!
వాట్సాప్ మరో కీలక ఫీచర్లో కొత్త అప్డేట్ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఒకేసారి ఎక్కువమందితో చాట్ చేసేందుకు, ముఖ్య సమాచారాన్ని ఇతరులకు తెలియజేసేందుకు గ్రూపులో సభ్యుల సంఖ్యను పెంచనుంది. గతంలో ఓ గ్రూపులో గరిష్ఠంగా 256 మంది సభ్యులుగా ఉండేందుకు అనుమతి ఉండేది. ఇటీవలే ఈ సంఖ్యను 512కు అప్డేట్ చేసింది. తాజాగా ఈ సంఖ్యను మరింత పెంచనుంది. ఒక గ్రూప్లో 1,024 మంది ఉండేలా కొత్త ఫీచర్ను పరిచయం చేయనుంది. దీంతో ఒకేసారి ఎక్కువ మందితో చాట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లకు పూర్తిస్థాయిలో పరిచయం చేయనున్నట్లు సమాచారం. దీంతోపాటు గ్రూపు అడ్మిన్ల కోసం కొత్త అఫ్రూవల్ సిస్టమ్ తీసుకురానుంది. ఈ ఫీచర్తో అడ్మిన్ గ్రూప్లో చేరేందుకు రిక్వెస్ట్ పంపిన వ్యక్తుల జాబితాల పెండింగ్ పార్టిసిపెంట్స్ గా కనిపిస్తుంది. వారిలో ఎవరినైతే గ్రూపు సభ్యులుగా చేర్చుకోవాలనుకుంటున్నారో వారిని అనుమతిస్తే సరిపోతుంది. దీనివల్ల ఎక్కువ మంది సభ్యులున్న గ్రూపుల నిర్వహణ సులువవుతుందని వాట్సాప్ భావిస్తోంది.






