వాట్సాస్ వెరిఫికేషన్ మార్క్.. త్వరలోనే!

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ చానల్ వెరిఫికేషన్ చెక్ మార్క్ త్వరలోనే నీలి రంగులో కనిపించబోతున్నది. ప్రస్తుతం ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నదనే సంగతి తెలిసిందే. అయితే వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఈ మార్క్ నీలి రంగులో ఉన్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో అనే ఫీచర్ ట్రాకర్ గుర్తించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లలో మాదిరిగానే వాట్సాప్ మార్క్ కనిపించేలా మార్పులు చేయాలని వాట్సాప్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఐఓఎస్, డెస్క్‌టాప్‌ల టెస్టర్స్‌కు దీనిని రోల్ అవుట్ చేయనున్నట్లు సమాచారం.