వాట్సప్ యూజర్లకు శుభవార్త.. మరో కొత్త ఫీచర్
వాట్సాప్ తాజాగా తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి మరో కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. వాయిస్, వీడియో కాల్స్ సౌకర్యాన్ని డెస్క్ టాప్ యాప్‌నకూ కలిపించినట్టు వాట్సాప్ ప్రకటించింది. ఈ సౌకర్యాన్ని పొందాలంటే డెస్క్ టాప్ /ల్యాప్ ట్యాప్‌తో పాటు మొబైల్ కూడా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉండాలి. కస్టమర్లకు నమ్మదగిన, అత్యంత నాణ్యమైన అనుభూతి కలిపిస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. డెస్క్ టాప్ యాప్‌నకూ గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్‌ను రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్టు వివరించింది. ఏడాదిగా వాట్సాప్ కాల్స్ పెరుగుతున్నాయని, నూతన సంవత్సర వేడుక నాడు 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్ నమోదయ్యాయని వెల్లడించింది.






