India : భారత్‌పై ప్రతీకార టారిఫ్‌ల ప్రభావమెంత?

ఏప్రిల్ 2 నుంచి భారత్‌తో సహా కీలక భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం అనుకుంటోంది. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికా అమలు చేసే విషయంపై ఇప్పటివరకైతే భారత పరిశ్రమ, ప్రభుత్వ అధికారులకు సమచారం లేదు. భారత్ సహా కొన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు అమెరికా (America) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకం విధింపు నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశాలూ లేకపోలేదు. ఈ సుంకాల విధింపు ఉత్పత్తులపైనా? లేదంటే రంగాలవారీగా ఉంటుందా? అనే విషయంపైనా ఎటువంటి స్పష్టత లేదు. భారత్‌పై ప్రతీక సుంకాలు విధిస్తే ఈ ప్రభావం ఎలా ఉండొచ్చనే విషయాన్ని జీటీఆర్‌ఐ (GTRI) విశ్లేషించింది. ప్రస్తుతం భారత్‌కు అమెరికా చేసే ఎగుమతులకు సగటున 7.7 శాతం టారిఫ్ ఉండగా, అమెరికాకు భారత ఎగుమతులపై కేవలం 2.8 శాతమే. అంటే వ్యత్యాసం 4.9 శాతం, ఒకవేళ భారత్ నుంచి ఎగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై ఏకరీతిలో అమెరికా టారిఫ్ (Tariff) లు విధిస్తే, అదనంగా రూ.4.9 శాతం మేర పెరగొచ్చు.